Articles

19 Dec 2025

Language Has No Religion: Honoring Urdu Heritage at Surur-e-Urdu Mahotsav – An Article by Abdul Gafoor

భాషకు మతం ఉండదు, మాతృ భాషను గొరవిస్తూ, మాతృ భాషను, సంస్కృతిని కాపాడుకోవాలి - Nara Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ పేరిట జరుపుతున్న వారోత్సవాలలో భాగంగా ఈరోజు కడప మహానగరం నందు ఉర్దూ ఉపాధ్యాయులు, ఉర్దూ పండితులు మరియు ఉర్దూ ప్రేమికులు కలిసి దాదాపుగా 1200 మందికి పైగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉర్దూ భాష పండితులు ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షిబ్లి గారిని ఉద్దేశిస్తూ షిబ్లి గారి ఆధ్వర్యంలో ఉర్దూ అకాడమీకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని (షాయిరీ) కవిత్వాలతో స్వాగతం పలుకగా.. భారతదేశంలో ఉర్దూ భాషకు ఎవరైనా మేలు చేసిన నాయకుడు ఉన్నారు అంటే వారు కేవలం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గచ్చిబౌలి వంటి ప్రాంతంలో నాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. Mohammed Farooq Shubli గారి ప్రసంగాన్ని క్రింది వీడియోలో చూడగలరు.

26 Aug 2025

Article by Abdul Gafoor on Muslim Minority Voting Trends in 2024 Elections

గతంలో ఎన్నడు లేని విధంగా ముస్లిం మైనారిటీల ఓట్లను తెలుగుదేశం పార్టీ (కూటమి) సాధించగలిగింది. 2024 ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల ఓట్లు అధికశాతం సాధించిందంటే కేవలం చంద్రబాబు గారిపై నమ్మకంతోనే కూటమి అభ్యర్థులను సైతం అక్కున చేర్చుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని ధ్రువపరుస్తూ 175 స్థానాలు గాను 164 స్థానాలు గెలవడం మరియు వైసీపీ నిలబెట్టిన ఏడుగురు ముస్లిం మైనార్టీ అభ్యర్థులను ఘోరంగా ఓడిస్తూ తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన ముగ్గురు ముస్లిం మైనారిటీ అభ్యర్థులను ఘన విజయాన్ని కట్టబెట్టడమే మరొక ఉదాహరణ. ముస్లిం మైనార్టీలు చంద్రబాబు గారిపై నమ్మకం ఉంచడానికి అదే సమయంలో జగన్ రెడ్డిని నమ్మకపోవడానికి కారణాలు అనేకమైన ఉన్నాయి. ముఖ్యంగా గడచిన పదేళ్లలో అనేక అంశాలను సునిశితంగా గమనించిన ముస్లిం మైనార్టీలు 2024 ఎన్నికల్లో తమ స్పష్టమైన నిర్ణయాన్ని ఫలితాల ద్వారా చెప్పారు. ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు గారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ముస్లిం మైనారిటీల ఓటు షేర్ ను మరింతగా పెంచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉంది. ముస్లిం మైనార్టీలలో చాలా వరకు రాజకీయ చైతన్యమైతే వచ్చింది కానీ రాజకీయ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ముస్లిం మైనారిటీలలో వచ్చిన ఈ మార్పును మరింతగా పెంచుకోవాలంటే ముస్లిం మైనార్టీలకు రాజకీయ అవకాశాలు మరింతగా కల్పిస్తూ నాయకత్వాన్ని పెంపొందించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలోని పెద్దలపై ఉంది. ముఖ్యంగా ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న రాయలసీమ వంటి ప్రాంతాల్లో సరైన ముస్లిం అభ్యర్థులకు తెలుగుదేశం జిల్లా బాధ్యతలు ఇవ్వడం వల్ల రాయలసీమ ప్రాంతాల్లో ఫలితాలపై ఏకపక్షంగా ప్రభావం చూపే మైనారిటీలకు మరింతగా చేరువ అవ్వడమేకాక ఇప్పటివరకు కొనసాగిన వైసీపీ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టవచ్చని రాయలసీమ జిల్లాల ముస్లింలు మరియు 35వేల మంది మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తూ రాయలసీమ ప్రాంతం పైనే కోటి ఆశలు పెట్టుకునే జగన్ రెడ్డి లాంటి వారికి కనుచూపు మేరలో అవకాశాలే ఉండవని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. చివరగా ఒక్క మాట: ముస్లిం మైనార్టీలకు ఏవైనా పదవులు కట్టబెట్టాలంటే మైనారిటీ కార్పొరేషన్, హజ్ కమిటీ, వక్ఫ్ బోర్డు లేదా ఉర్దూ అకాడమీలలో మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా కాకుండా ప్రతి విభాగంలోనూ దామాషా ప్రకారంగా మైనార్టీలకు కూడా అవకాశాలు కల్పించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇదే కనుక జరిగితే 80 నుండి 90% మైనార్టీలు తెలుగుదేశం వెంట ఎప్పటికీ నడుస్తారు అనడంలో సందేహం లేదు.

10 Jul 2025

Is There a Political Silence Around Good Governance? – An Article by Abdul Gafoor

తెలుగుదేశం పార్టీకి శాపం ఉందా..? ముస్లిం మైనారిటీల కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేసింది.. అంటే ఏ ఇతర పార్టీలు చేయనంత మంచిని చేసింది అని ఘంటాపదంగా చెప్పగలను. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న పెద్ద లోపం చేసింది చెప్పుకోకపోవడం. ఒక ముస్లిమ్ సామాజిక వర్గానికే కాదు ప్రతి వర్గానికి మంచి జరిగింది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ లోనే జరిగింది అని కచ్చితంగా చెప్పాలి. కానీ నాయకులు మరెందుకో దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళరు. చేసింది చెప్పుకుంటే దిష్టి తగులుతుందా..? లేక పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన శాపంలా.. మనం చేసిన మంచి చెప్పుకోకుండా మరచిపోవాలని ఏదైనా శాపం ఉందా..? ఇది బ్రహ్మ రహస్యంగా ఉంది. ఇతర పార్టీల వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని చేస్తే 100 పనులు చేసినట్టుగా చెప్పుకుంటారు కానీ మనం (తెలుగుదేశం) మాత్రం 100 మంచి పనులు చేసినా ఒక్కటి కూడా చెప్పుకోం. ఎందుకో..!? ఇలాంటి కారణాలతోనే కదా అరాచకుల చేతిలో, ఉన్మాదుల చేతిలోకి మన రాష్ట్ర పాలన వెళుతున్నది. దీనివల్ల మన తెలుగు జాతి నష్టపోతుంది. 2019 ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అయినా మార్పు వస్తుందని భావించా.. అబ్బే మనం మారం గాక మారం.. మేమింతే..! ఉర్దూలో ఒక సూక్తి ఉంది "నేకి కర్ దరియా మే దాల్" అని అలా అనుకోవడానికి ఇక్కడ జరుగుతుంది పాప పుణ్యాల వేట కాదు. ఇది రాజకీయ చదరంగపు ఆట కాబట్టి "నేకి కర్ సోషల్ మీడియా మే దాల్" అని పాటించాల్సిందే.. తప్పదు..! అరె మొన్నటికి మొన్న తల్లికి వందనం పేరుతో విద్యార్థులు ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి పధకం అమలు పరిచినా దాన్ని కూడా మనం ఎందుకో చెప్పుకోలేకపోతున్నాం. గత జగన్ రెడ్డి పాలనలో అరాచకాల వలన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థికసాయం మన తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా అందబోతుంది. జగన్ రెడ్డి ఆపిన ఇమామ్ మౌజ్జన్ ల గౌరవ వేతనాలను చంద్రబాబు గారు అందించారు దీనిపై మాట్లాడరు. ఇలా ఎన్నో ఎన్నెన్నో........ కానీ మనం మారం.

06 Jun 2025

From Arrest to Courtroom: The Ongoing Legal Battle of Farooq Shubli - An Article by Abdul Gafoor

సంచలనం సృష్టించిన కడప జిల్లా బద్వేలు కోర్టు ఫారూఖ్ షిబ్లీ హత్య యత్నం కేసు అప్డేట్స్.. కడపకు రావాలంటే మాజీ సీఎం జగన్ గారి పాస్పోర్ట్ మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష వీసా ఏమైనా కావాలా..? పోరాట యోధుడు ఫారూఖ్ షిబ్లీ గారికి ఆపద్బాంధవుడు జి.ఎస్. మూర్తి గారు ప్రముఖ సీనియర్ న్యాయవాది/Ex. పబ్లిక్ ప్రాసిక్యూటర్, & తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (కడప). గత వైసీపీ ప్రభుత్వంలో వేధింపులు తాళలేక నంద్యాలకు చెందిన అబ్దుస్ సలాం కుటుంబ సమేతంగా ఆత్మహత్య (రైలు పట్టాలపై) చేసుకున్న ఉదంతం తర్వాత కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్ బాషా అనే వ్యక్తి తాను 48 గంటల్లో ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ వదిలిన వీడియో వైరల్ అవ్వడంతో అబ్దుస్ సలాం లాంటి మరో ఘటన చోటు చేసుకోకూడదని అతన్ని కలిసి పరామర్శించేందుకు వెళుతున్న ఫారూఖ్ షిబ్లి గారిని మార్గ మధ్యలో అరెస్టు చేసి తప్పుడు కేసును (11/09/2021) నమోదు చేసి 5 రోజులపాటు కడప జైలులో ఉంచిన విషయం తెలిసినదే. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారు అనుక్షణం వివరాలను ఆరాతీస్తూ ఫారూఖ్ షిబ్లి గారు బయటకు వచ్చే వరకు చూపిన చొరవ మరువలేనిది. బద్వేలు కోర్టులో తనపై ఉన్న కేసు వాయిదాకు ఈరోజున ఫారూఖ్ షిబ్లి గారు హాజరయ్యూరు. ఈ కేసును తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (కడప), అడ్వకేట్ జి.ఎస్. మూర్తి గారు వాదిస్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అరాచకాలు రాష్ట్ర ప్రజలు మరచిపోకపోయినా.. న్యాయం వైపు నిలబడిన వారిని, ప్రశ్నించిన వారిని, పరామర్శలకు వెళుతున్న వారిపై కూడా హత్యా యత్నం కింద కేసులను నమోదు చేసిన ఘనత ఒక్క వైసీపీ వారికి మాత్రమే దక్కుతుంది. అది వైసీపీ హయంలోనే చెల్లింది. ఫారూఖ్ షిబ్లి వేసే ప్రతి అడుగు తమకు (వైసీపీ) ప్రతికూలంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని భావించి.. కక్షపూరితంగా షిబ్లి గారి ఆశయాలను తొక్కాలని, ముస్లిం మైనారిటీలలో తీసుకువస్తున్న చైతన్యాన్ని నీరుగార్చాలని, భయపెట్టాలని చూస్తే.. ఆయనలో మరింత 'కసి' కసి-కసిగా పెరిగింది. ఈరోజు బద్వేల్ కోర్టు హాల్లో సీనియర్ న్యాయవాది మూర్తి గారు వాదిస్తూ పోలీసులు నా క్లైంట్ ఫారూఖ్ షిబ్లీ గారిని ఆపితే కడపకు రావాలంటే ముఖ్యమంత్రి గారి పాస్పోర్టు ఉప ముఖ్యమంత్రి గారి వీసా కావాలా..? అన్న మాటలకు కోర్టు హాలు మొత్తం ఒక్కసారిగా ఫారూఖ్ షిబ్లీ గారి వైపుకు చూస్తూ నవ్వులు చిందించారు. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ, లా అబాయ్డింగ్ సిటిజన్గా వాయిదాలకు క్రమం తప్పకుండా సామాన్య వ్యక్తిగా ఫరూఖ్ షిబ్లీ హాజరుతున్నారు, మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టు వాయిదాలకు 10 సం||ల నుండి ఎందుకు కావటంలేదు?

04 Jun 2025

More Than a Leader: Vision, Execution, and Resilience – An Article by Abdul Gafoor

Mohammed Farooq Shubli ఒక వ్యక్తి మాత్రమే ఆయన నిర్వహించే కార్యక్రమాలు, రూపొందించే కార్యాచరణలు అనేకం. ఒకొక్కరిలో ఒక్కో నైపుణ్యం ఉంటుంది విభిన్న నైపుణ్యాలున్న అనేక మందిని ఒకే వేదికపైకి తీసుకొని రావడమే షిబ్లి గారి విజయ రహస్యం. ఆలోచన రావడం కాదు ఆ ఆలోచనను అమలు చేయడం గొప్ప. తనతోటి వారని, టీమ్ సభ్యులను తన ఆలోచనలకు అనుగుణంగా నడిపించడం గొప్ప. ఒక టీమ్ లో ఉన్న సభ్యుల మధ్య విధానపరమైన భిన్నాభిప్రాయాలు ఉంటాయి. పనిచేసే విధానంలో ఎవరికి వారు గొప్పగానే భావిస్తారు. ఒక టీమ్ లో విద్యావంతులు, మేధావులు వయసులో పెద్దవారు చిన్నవారు ఉండడంతో వారిని ఏకతాటిపై నడిపించడం అనేది కత్తిమీద సాము లాంటిదే. షిబ్లి గారు దీనిని సాధ్యం చేసారు కాబట్టే కొందరు ఆయన్ను చూసి అసూయతో రగిలిపోతారు. ఫారూఖ్ షిబ్లి గురించి గొప్పగా నేను చెప్పడం కాదు ఏదో ఆయన్ను మెప్పించి లబ్ది కోసమో, ఏదైనా పదవులు పొందాలనుకోవడానికి ఆయన ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు. నా దృష్టిలో మాత్రం ఆయన అంతకు మించిన వ్యక్తి. సామాజిక అంశాలలో, రాజకీయ అంశాలలో ఫారూఖ్ షిబ్లి గారి ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేరు. పండ్లున్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలెక్కువ. గత ప్రభుత్వపు అరాచక పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బాధితులకు అండగా గళమెత్తుతు వచ్చారు. వైసిపి అరాచకాలను, వైఫల్యాలను ప్రజల్లోకి మరీ ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లడం వలన 2025 ఎన్నికల్లో ముస్లిమ్ మైనారిటీల ఓట్లను కూటమి సాధించగలిగింది. ఇందులో ఫారూఖ్ షిబ్లి గారి పాత్ర కచ్చితంగా ఉందనే చెప్పాలి. భజరంగీ భాయ్ జాన్, బాహుబలి, RRR వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు తన కథలను అందించిన విజయేంద్ర వర్మ గారు రాజ్యసభ సభ్యులు (డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి) ఫారూఖ్ షిబ్లి గారి అనేక సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని, మతాలకు అతీతంగా చేసే కార్యక్రమాలను చూసి ఫోన్ చేసి అభినందించడమే కాదు స్వయానా షిబ్లి గారి కార్యాలయానికి విచ్చేసి అభినందించడమే చెబుతుంది షిబ్లి గారి ప్రత్యేకతను. షిబ్లి గారి కోరికమేరకు పండిట్ రవిశంకర్ లాంటి వారు తమ సమయాన్ని కేటాయించడం, విజయవాడ డివి మేనర్ లో జరిగిన సభకు హాజరు కావడం స్పష్టం చేస్తుంది మతాలకు అతీతంగా షిబ్లి గారి లౌకికవాదాన్ని. ఇవన్నీ ఒకతైతే పెహల్గాంలో ఉగ్రవాద దాడులను ఖండిస్తూ మొన్న జరిగిన గవర్నర్ గారి సమావేశంలో ప్రసంగ అవకాశాన్ని అందుకోవడం........ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. మీ ప్రధాన బలమైన ఓర్పు, సహనం, పట్టుదల, సమయస్పూర్తి, ఏకాగ్ర, చేసే పనిపట్ల నిబద్ధత మరియు అంకితభావం, పెద్దల పట్ల గౌరవం, చిన్నవారి పట్ల ఆప్యాయత.. మొదలగు అంశాలను ఎన్నటికీ వీడవద్దు.. ఎందుకంటే..! మీ పక్కనే ఉంటారు పొగలు కక్కుతుంటారు. మీతోనే ఉంటారు మాడు వాసనలు వెదజల్లుతారు. ముందు పొగడ్త .. వెనుక విమర్శ. ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉంటూ మీ ఆశయ సాధనలో విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ స్వర్గీయులు మొహమ్మద్ ఖైరుల్లా ఫాతిమా పర్వీన్ ల ముద్దుబిడ్డగా జన్మించిన మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ...

02 Feb 2025

A Movement Beyond Politics: The Expanding Strength of MHPS – An Article by Abdul Gafoor

వేదికపై ముఖ్య అతిథులుగా రాజకీయ ప్రముఖులు లేరు, మత బోధకులు మత ప్రచారకులు లేరు, ప్రేరణాత్మక వక్తలు లేరు. అయినా సరే జనవరి 26న విజయవాడ లోని 'షా - జహూర్ ముసాఫిర్ ఖానా' కిట-కిట లాడింది. జనాలతో కిక్కిరిసింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి 8వ వార్షికోత్సవం జరుగుతున్న వేళ రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల నుంచి దాదాపు 1000 మంది ఎంహెచ్పీఎస్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో 65 నుంచి 80 నియోజకవర్గాల్లో ఎంహెచ్పిఎస్ సంస్థ సభ్యులు ఉన్నారు. ఇది సంస్థ యొక్క పనితీరును అద్దంపడుతుంది. 2017 లో మొదలైన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రజల పక్షాన మరీ ముఖ్యంగా పేదల పక్షాన నిలబడుతూ ప్రజల గొంతుకై వారి హక్కుల సాధనకై ప్రజా శ్రయస్సు కోసం వారి హక్కుల కోసం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం అధికారపక్షాన్ని నిలదీస్తూ ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చింది. అధికార మార్పిడిలో తన పాత్రను సైతం విజయవంతంగా పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో సంస్థ అధ్యక్షులు జనాబ్ ఫారూఖ్ షిబ్లి (Mohammed Farooq Shubli) గారిని అక్రమ అరెస్టు చేయడం, ఆయనకు అనేక బెదిరింపు కాల్స్ రావడం షరా మామూలే అయ్యింది. ఇంతేకాదు ఇప్పటికీ కొందరు ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుల వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తలమాసిన చెత్తగాళ్ళు సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్టులను, చేసే వీడియోలను మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. ఆ పోస్టులు, వారి చెత్త వీడియోలు చెబుతాయి ఎంహెచ్పిఎస్ సంస్థ ఎదుగుదల ఏపాటిదో అని, సంస్థపై పనికిమాలినవారి అక్కసు ఏపాటిదో అని. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలో మరీ ముఖ్యంగా దళిత మరియు ముస్లిం మైనారిటీలలో రాజకీయ చైతన్యాన్ని నింపుతూ తమ ఓటు విలువను తెలుసుకునేలా చేయడంతో పాటుగా తమ హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి అనే ప్రత్యేక అంశాలతో కూడిన సభలపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ బాధితులకు అండగా ఉంటూ నాటి అధికార పక్షానికి ఒక రకంగా సింహస్వప్నంలా మారింది అనడానికి సంకోచమే లేదు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏ ఒక్క వర్గానికి పరిమితం కాకుండా కులమతాలకు, వర్గ-వర్ణాలకు అతీతంగా అందిస్తూ వచ్చిన సేవలను చూస్తే.. మతసామరస్యాన్ని పెంపొందిస్తూ, సోదర భావాన్ని నెలకొల్పే విధంగా అయ్యప్ప మాల ధరించిన స్వాములకు సద్ది, భిక్ష ఏర్పాట్లు చేయడం, ప్రతి సంవత్సరం దసరాలో జరిగే బెజవాడ కనకదుర్గ ఉత్సవాలకు హాజరయ్యే ఆశేష జనావాహిని దృష్టిలో పెట్టుకొని బారులు తీరే దుర్గమ్మ భక్తులకు సేవలను అందిస్తూ మజ్జిగ పంపిణీ చేయడం ఇలాంటి ఎన్నో సేవలు అందించడం వల్ల మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కుల, మతాలకు అతీతంగా అనేక హృదయాల్లో అభిమానాన్ని దక్కించుకుంది. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించగలిగింది. ప్రజలకు కష్టం వచ్చిన చోటుకు చేరుకోవడం, బాధితులకు పీడితులకు అండగా ఉండడం, బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటాన్ని కొనసాగించడం. ఇలాంటి అనేక సేవల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సేవలకు ఆకర్షితులైన వారివల్ల నేటికి 35 వేల మంది సభ్యులను సంపాదించుకోగలిగింది. ఈ సంవత్సరం 2025 పూర్తయ్యే నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది సభ్యులు తమ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఎనిమిదవ సంవత్సరంలో అడుగుపెట్టిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సంస్థ కుటుంబ సభ్యులకు మరియు సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి (Mohammed farooq shubli) గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2029 వరకు కార్యచరణలో భాగంగా రూపొందించిన మేనిఫెస్టోలోని ప్రతి అంశంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #మరి_కొంతకాలంలో_జరగబోయే స్థానిక ఎన్నికలకు గాను ఇప్పటికే రూపొందించుకున్న అద్భుతమైన ప్రణాళికలో ఘన విజయం సాధిస్తారనే ధృడ నమ్మకంతో ఉన్నాను. 2029 ఎన్నికలకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి బలం పదింతలు పెరుగుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. 80 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములు ఏకపక్షంగా ఉండబోతున్నాయని ఘంటాపథంగా............... మొక్కగా మొలిచి వృక్షంగా మారిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మైనారిటీలు, దళితులు, బడుగు బలహీనవర్గాలకు తన నీడనిస్తూ మహావృక్షంగా తన సేవలను అందిస్తూ విస్తృత రూపం దాల్చబోతుంది. ప్రస్తుతం మన సమాజంలో.. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ నలుగురికి ఉపయోగపడుతూ ఉన్నత సమాజ నిర్మాణానికి నిర్దేశించుకున్న లక్ష్యాలకు చేరుకునే దశలో ఎంతోమంది చేత మన్ననలు పొందుతారు, దీవెనలు అందుకుంటారు అదే సమయంలో కొందరి కడుపు మంటను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి కొందరు ఉచ్ఛ నీచాలు మరిచి దిగజారుడుతనంతో తమ అసమర్ధతను విషం రూపంలో కక్కుతుంటారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సంస్థ ఎదుగుదల, చిన్న వయసులోనే ఆ సంస్థ అధ్యక్షుడికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి కొందరు ఓర్వలేక, వారితో పోటీ పడలేక, ఇది జీర్ణం చేసుకోలేక కడుపు ఉబ్బరంతో వారి కడుపులో పేరుకుపోయిన విషవాయువును ముందు నుండి వదిలే ధైర్యం లేక వెనక నుండి వదులుతూ సమాజాన్ని గబ్బు పట్టిస్తారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సంస్థ మరియు అధ్యక్షులవారు అంటారు.. తగ్గేదే..లే..! అని. మనం విజయవంతం అవ్వాలంటే..? ఆ మాత్రం ఏడుపులు ఉండాలి. కదా..!?

18 Dec 2024

Participation in the 20th World Minority Rights Day and Advocacy for Urdu Education Reforms – An Article by Abdul Gafoor

ప్రపంచ మైనారిటీ హక్కుల దినోత్సవంలో పాల్గొన్న జనాబ్ మొహమ్మద్ ఫరూక్ షిబ్లీ. 20వ వార్షిక ప్రపంచ అల్పసంఖ్యకుల హక్కుల దినోత్సవానికి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం తరపున జాతీయ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్య & మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ గారు, NCMEI (నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్) జాతీయ సభ్యులు డాక్టర్ షాహిద్ అఖ్తర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు Mohammed Farooq Shubli గారు NCMEI జాతీయ సభ్యులు డాక్టర్ షాహిద్ అఖ్తర్ గారికి ఆంధ్రరాష్ట్ర లాంగ్వేజ్ ఉర్దూ టీచర్ల నియామకం చేయాలని, ఉర్దూ మాధ్యమంలో అంగన్వాడి కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించాలని, రాష్ట్రంలో ఉర్దూ మాధ్యమంలో నూతన జిల్లాల్లో డైట్ కాలేజీలు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించటం జరిగింది. ఈ సందర్భంగా NCMEI జాతీయ సభ్యులు డాక్టర్ షాహిద్ అఖ్తర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా Mohammed farooq shubli గారు మాట్లాడుతూ ఇటువంటి సదవకాశాన్ని కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మైనారిటీ & న్యాయశాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ NMD ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం రాష్ట్రీయ మంచ్ నాయకులు ఇంద్రేష్ కుమార్ గారు, నేషనల్ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్, మొహమ్మద్ ఫరూక్, ప్రొఫెషన్ డాక్టర్ ఫేజాన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

22 Sep 2024

An Unforgivable Offense Against Faith and Devotion – An Article by Abdul Gafoor

అపచారం.. ఘోర అపరాధం. హైందవ సోదరులు తిరుమలేశుని సన్నిధిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. లడ్డు రూపంలో దొరికే ఆ వేయి నామాల వారి ప్రసాదాన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డుపై నిర్గాంతపోయే విషయాలను వింటుంటే, కొన్ని రోజులుగా తిరుమల ప్రసాదంపై కొనసాగుతున్న వివాదాలను చూస్తుంటే, అవి కేవలం ఊహాగానాలు, అపనిందలు కాదు అవన్నీ వాస్తవాలే అని చేసిన పరీక్షల్లో నిరూపితమై, ఒళ్ళు గగుర్పొడిచే వాస్తవాలు బయటకు వస్తుంటే ఒక ముస్లింగా నేనే తట్టుకోలేకపోయాను. ఇక హైందవ సోదరుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందనేది నా ఊహకు అందడం లేదు. ఏ ఇతర మతస్తుడైన ఇంతటి దిగజారుడుతనానికి పాల్పడతాడా అనే ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. ఇంతటి దుర్మార్గానికి కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా పూనుకుంటాడా..? ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడేవాడిది మనిషి పుట్టుకేనా..? ఇతర మతస్తుల మనోభావాలను కించపరచమని, దెబ్బతీయమని ఏ మతం బోధిస్తుంది..? కమిషన్ల కోసం ఇంత కక్కుర్తినా..!? నిజంగా కమిషన్ల కోసమేనా..? లేక ఇతరుల మతవిశ్వాసాలు అంటే చులకన భావమా..!? ఇది ముమ్మాటికి చులకన భావం అనే అర్థమవుతుంది. దీనికి తగు పరిణామాలను చవిచూడక తప్పదు. ఒక మానసిక రోగికి, కుల పిచ్చి, మత పిచ్చి, డబ్బు పిచ్చి ఉన్న వాడికి అధికారం కట్టబెడితే ఇలాంటి పరిణామాలే మనం చూస్తాం అనేదానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా..? తిరుమల వెంకటేశుని ప్రసాదం పట్ల జరిగిన ఈ ఘోర అపచారమే ఉదాహరణ కాదా..!? వాడి కులం కల్తీ, వాడి మతం కల్తీ, వాడి మాటలు కల్తీ, పెట్టిన పార్టీ కల్తీ, గడిచిన ఐదు సంవత్సరాలు కొనసాగించిన పరిపాలన కల్తీ, పేదలపై చూపిన ప్రేమ కల్తీ, పేదలకు ఇచ్చిన బియ్యం కల్తీ, అమ్మిన లిక్కర్ కల్తీ, కరోనా సమయంలో జల్లిన బ్లీచింగ్ కల్తీ..... ఆ మనిషే పెద్ద కల్తీ. కల్తీ అనే పదం మానవ రూపం దాల్చితే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉంటుందన్నది వాస్తవం. ఇందులో సందేహం ఎవరికైనా ఉందా..? ప్రతిదానికి ప్రమాణం చేస్తాను అనేవాడు, ప్రతి మాటకు ముందు, మాట తర్వాత దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు.. అనేవాడికి దైవభీతి అస్సలు ఉండదు. ఇది 100% వాస్తవం. జగన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టినప్పటి నుండి మన రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని వ్యవస్థలను, మాత్రమే బ్రష్టు పట్టించాడు అనుకున్నాము గాని తిరుమల దేవస్థానంలో ఇంతటి ఘోర అపచారానికి పాల్పడతాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. జగన్ రెడ్డి పాలనలో రధాలు తగలబడితే "తేనెటీగలు తగలబెట్టాయి" అన్నాడు. రామతీర్థం లోని శ్రీరాముల వారి విగ్రహం తలను తొలగిస్తే "అల్లరిమూకల పని" అన్నాడు. బెజవాడ దుర్గమ్మ వెండి సింహాలు దొంగలించబడితే "వచ్చిన నష్టం లేదు కొత్తవి చేయిద్దాం" అని చెప్పించాడు, గుళ్ళపై, గోపురాలపై దాడులు జరిగితే "పిచ్చివారు చేసారు" అని చెప్పారు. వీటన్నిటినీ మించి ఇప్పుడు బయటపడ్డ ఏడుకొండలవారి ప్రసాదం పట్ల ఘోర అపచారం. ఇంతటి దారుణ మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఇప్పటి వరకు వెనకేసుకు వచ్చిన కొందరు మేధావులు, పండితులు, మత గురువులారా..! ఇప్పుడు దీనిపై ఏం సమాధానం ఇస్తారు..? ఇలాంటి వారిని వెనకేసుకు వచ్చిన మీకు ఈ పాపంలో భాగం ఉండదా..? ఇంతటి నీచానికి పాల్పడ్డవాడు కడుపుకు తినేది అన్నం కాదు అశుద్ధం అనే చెప్పాలి. ఇతర మతాలను, వారి మత విశ్వాసాలను, మత ఆచార-వ్యహారాలను గౌరవించలేని వాడు పాలకూడిగా అర్హుడేనా..? ఇలాంటి వికృతమైన పనులతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, హైందవ ధర్మాన్ని అవహేళన చేసేవిధంగా, వారి పవిత్రతను భంగం కలిగించినవారికి ఏవిధమైన శిక్ష విధించాలి..?

15 Sep 2024

The Fragrance of Humanity: Unity Beyond Religion – An Article by Abdul Gafoor

మానవత్వపు పరిమళం. కుర్తా పైజామ, తలపై టోపి కౌమారదశ నుండే వదిలిన గెడ్డం అంతకుమించి మదరసాలో విద్యాభ్యాసాన్ని పూర్తీ చేసిన ఒక హాఫిజే ఖురాన్. ఇలాంటి వ్యక్తీ మసీదును శుభ్రం చేస్తుంటే పెద్ద విషయం కాకపోవచ్చు. అదే వ్యక్తీ గుడిని శుభ్రం చేస్తుంటే..!? ఇది పెద్ద విషయం గానే చూస్తారు కొందరు అతివాదులు, ఛాందస్సవాదులు. “భారతదేశము నా మాతృ, భారతీయులందరూ నా సహోదరులు,.....” అంటూ చిన్నతనం నుండే మనం చేస్తూ వస్తున్న ప్రతిజ్ఞను అందరికి గుర్తు చేసేలా చోటు చేసుకున్న ఒక సన్నివేసం ఇది. మొన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల బుడమేరుకు గండ్లు పడడంతో విజయవాడ పరిసర ప్రాంతాలు కొన్ని ముంపుకు గురికావడం మనందరికీ తెలిసిందే. ఈ ముంపు ప్రాంతాల్లోని బాధితులకు అనేక మంది సేవలను అందిస్తూ పలు సేవా కార్యక్రామాలను చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో గత 13 రోజులుగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న విజయవాడ నిమ్రా కాలేజీలో బీటెక్ మొదటిసంవత్సరం చదువుతున్న గుంటూరు శ్రీనగర్ కు చెందిన సయ్యద్ ఇందాదుల్లా అనే విద్యార్థి పలువురి దృష్టిని ఆకర్షించాడు. 10వ రోజున వరదనీరు పూర్తిస్థాయిలో తగ్గడంతో ఎవరి ఇళ్ళను వారు శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ రాజరాజేశ్వరిపేట లోని వినాయకుని గుడిని పూజారి ఒక్కరే శుభ్రం చేసుకుంటున్నారు. ఆ ప్రాంతంలోనే సేవలను అందిస్తున్న సయ్యద్ ఇందాదుల్లా ఆ పూజారికి సాయం చేసేందుకు తనతోపాటు ఉన్న సలీం అనే మరొక యువకునితో కలిసి పూజారికి సాయం చేస్తూ, గుడిని శుభ్రపరుస్తున్న దృశ్యం పలువురిని ఆకర్షించింది. నాలాంటి వారికైతే ఈ సన్నివేశం అక్కడే కట్టిపడేసింది. నేను చుసిన ఈ ఘటనను సోషల్ మీడియా మిత్రులతో పంచుకుందామనే ఉద్దేశంతో.. ఈ పోస్టు తయారు చేసే క్రమంలో నేను చూసిన సన్నివేశం నా కళ్లముందు కదలాడుతుంటే.. నాలో ఏదో తెలియని అనుభూతితో నేను రాస్తున్న అక్షరాలూ చూడడానికి కళ్ళలో నీటితెరలు అడ్డువస్తున్నాయి. ఇప్పుడు ఈ వాక్యాలను రాస్తుంటే (టైపు చేస్తుంటే) గూస్ బంప్స్ వస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం.. ఇదే కదా నా భారతదేశ గొప్పదనం..! సయ్యద్ ఇందాదుల్లా చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. తన తాతగారి (అమ్మ గారి తండ్రి) వద్ద పెరుగుతూ మదరసాలో హాఫిజే ఖురాన్ (అరబిక్ గ్రాడ్యుయేషన్) పూర్తీ చేసుకున్నాడు. అదేసమయంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ను పూర్తీ చేసుకొని ప్రస్తుతం విజయవాడ నిమ్రా కాలేజిలో బీటెక్ మొదటి సంవత్సరంలో ఉన్నాడు. కాలేజ్ స్టూడెంట్స్ అనగానే కాలేజీకి శెలవులు దొరికితే తమ ఫ్రెండ్స్ తో సినిమాకో, షికారుకో వెళ్ళాలనుకుంటారు. కాలేజి మెట్లు తోక్కగానే కొందరికి తమ తల్లిదండ్రుల మాటలు చేదుగా ఉంటాయి. కానీ సయ్యద్ ఇందాదుల్లా తన తాతగారి వద్ద పెరుగుతున్న యువకుడు. సయ్యద్ ఇందాదుల్లా గురించి తెలుసుకున్న నేను ఆ యువకునితో కలిసి మాట్లాడిన సందర్భంలో అతను ఇచ్చిన సమాధానం నన్ను మరింతగా ఆకట్టుకుంది. వర్షాల కారణంగా కాలేజికి శెలవు ఇచ్చారు ఇంట్లో ఉండి ఏం చేస్తాను అన్న. ఇక్కడ ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే చూసి తట్టుకోలేకపోయాను అన్నాడు. నీకు స్పూర్తి ఎవరు అని అడిగితె.. స్పూర్తిది ఎముందన్నా మన ఇస్లాం ధర్మం ఇదేకదా బోధిస్తుంది, ఇదే కదా ఆచరించమంటుంది అయినా 74 సంవత్సారాల చంద్రబాబు గారు ప్రజల కోసం పడుతున్న తపనతో పోల్చితే నాదేం ఉందన్నా ఉడతా భక్తిగా తప్ప. ఇలా సేవ చేస్తున్నది నేనొక్కడినే కాదు కదా..? విజయవాడకు చెందిన 180 మంది నాలాంటి వారు మా సంస్థ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరుపున సేవలను అందిస్తున్నారు మాలాంటి వారికి ఫారూఖ్ షిబ్లి (Mohammed Farooq Shubli) అన్న ఆదర్శమన్నాడు. కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్దికోసం, స్వార్థంతో అన్నతమ్ముల వలే మెలిగే మన మధ్య అగాధాలను సృష్టించాలను కుంటారు. అధికారం కోసం మనల్ని విడగొట్టి ఒకరంటే మరొకరికి బూచిలా చూపి, మన మనసులను కలుషితం చేసే వివాదాస్పద అంశాలను లేవనెత్తారు. అలాంటి చెత్త నాయకుల పప్పులు మన రాష్ట్రంలో ఇలాంటి యువత ఉన్నంతవరకు ఉడకవు అని చెప్పేందుకు ఇలాంటి ఘటనలు ఎన్నో ఎన్నెన్నో. "సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా..."

30 Jun 2024

A Historic Shift: Minority Support and the 2024 Electoral Mandate – An Article by Abdul Gafoor

అద్భుతం, అద్వితీయం, అనిర్వచనీయం, చిరస్మరణీయం. 2024 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.. అహంకారానికి, అరాచకానికి, విధ్వంసానికి తోలు ఒలిచారనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఎన్నడు లేని విధంగా ముస్లిం మైనార్టీల ఓటు శాతం ఈసారి తెలుగుదేశం పార్టీ వైపు మళ్లడం నాయకులను అబ్బురపరిచిందనే చెప్పాలి. దాదాపుగా 60 నుండి 65 శాతం ముస్లిం మైనారిటీలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అనే ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు పిలుపుమేర కూటమి అభ్యర్థులకే పట్టం కట్టారనడంలో సందేహమే లేదు. దీనికి 100 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం రెండు మూడు ఉదాహరణలు చూద్దాం.. ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్న ఆదోనిలో కూటమికి సంబంధించిన బీజేపీ అభ్యర్థి గెలవడం మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి కూటమికి సంబంధించిన బీజేపీ అభ్యర్థి గెలవడం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటక భావించే రాయలసీమ ప్రాంతంలో సైతం తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయ బావుటాను ఎగరవేయడం. ముస్లిం మైనారిటీల ఓట్లు లేకుండా రాయలసీమ మరియు గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఇంతటి విజయం సాధ్యం కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థులకు ఏడు స్థానాలను కేటాయిస్తే ఆ ఏడు స్థానాలలోని వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మూడు స్థానాల్లోని ముస్లిం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడం మరో ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 70 నియోజకవర్గాల్లో 30 వేలకు పైబడి ముస్లిం మైనారిటీల ఓటు ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. అటువంటి ప్రాంతాల్లో సైతం వైసీపీ గెలవకపోగా.. ముక్కుతూ మూల్గుతూ 175 స్థానాలకు గాను 11 స్థానాలు మాత్రమే సాధించిందంటే..? ముస్లిం మైనారిటీలు తెలుగుదేశం పార్టీని ఆదరించిన విధానం, చంద్రబాబు గారిపై నమ్మకంతో కూటమి అభ్యర్థులను అక్కున చేర్చుకున్న విధానం 👌👌👌. ఇదే సమయంలో మైనారిటీల నమ్మకాన్ని, ఓటు బ్యాంకును నిలుపుకుంటూ రాబోవు కాలంలో మైనారిటీల ఓట్ పర్సంటేజ్ పెంచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైనే ఉంది. తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టులలో ముస్లిం మైనార్టీలకు తగు ప్రాధాన్యత నివ్వాలి. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ తరపున ఇద్దరు శాసనసభ్యులుగా ఎన్నిక కాగా (యన్.యం.డి ఫారూఖ్, షాజహాన్) వారిలో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఆనందకరమైన విషయం. ఇక కోస్తా ఆంధ్ర నుండి ఉత్తరాంధ్ర వరకు చూస్తే ఒక్క మైనారిటీ వ్యక్తి (మహమ్మద్ నసీర్ అహ్మద్ - గుంటూరు తూర్పు) మాత్రమే అవకాశం దక్కగా ఆయన కూడా శాసనసభ్యునిగా గెలవడం జరిగింది. రాయలసీమ తర్వాత గుంటూరు కృష్ణాజిల్లాలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్నారు కనుక ఈ ప్రాంతంలో బలమైన ముస్లిం నాయకున్ని తయారు చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎంతైనా ఉంది. అంతేకాకుండా పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలను చూస్తే రాయలసీమలో లాగా మరియు కృష్ణ గుంటూరు జిల్లాల్లో మాదిరి ముస్లిం మైనార్టీల అత్యధిక జనాభా లేకపోయినా వారి ప్రభావమైతే ఎంతో కొంత ఉంది. ఈ ఐదు ఉమ్మడి జిల్లాలలో కలిపి ఉత్తరాంధ్ర విశాఖపట్నం నుండి ఒక మైనారిటీ నాయకున్ని తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా 100% ఉంది. ముస్లిం మైనారిటీలకు పదవులు అనగానే వక్ఫ్ బోర్డ్, హజ్ కమిటీలు అనేలా కాకుండా.. అన్ని విభాగాల్లో దామాషా ప్రకారంగా అవకాశాలు కల్పిస్తేనే మైనార్టీలలో నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ పెంపొందించగలదు. ఇకమీదట మైనారిటీల ఓటు బ్యాంక్ కు నో డౌట్. దీనికి కొనసాగింపుగా వచ్చే ఆదివారం పోస్ట్ చేస్తాను ఇప్పటికే మేటర్ పెద్దదిగా ఉండడంతో ముగిస్తున్నాను.